Site icon NTV Telugu

Radha Madhavam : ఆసక్తికరంగా విలేజ్ లవ్ స్టోరీ ‘రాధా మాధవం’ ట్రైలర్

Radha Madhavam

Radha Madhavam

Radha Madhavam Trailer: విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీల్లోని సహజత్వాన్ని ఉట్టి పడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించగా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమ కథా చిత్రమని తెలుస్తోందని, ట్రైలర్ చాలా బాగుందని అన్నారు. ఇక ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని పేర్కొన్న హీరో, దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపు తీసుకు రావాలని కోరారు.

ఇక ఈ సినిమా నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ ‘మా సినిమా ట్రైలర్‌ను శ్రీకాంత్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, ఫిబ్రవరిలో మా సినిమా రాబోతోందని అన్నారు. ఆడియన్స్ మా సినిమాను చూసి సక్సెస్ చేయాలని అన్నారు. ఇక హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ ‘మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్ కి థాంక్స్’ అని అన్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నారు. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు పేర్కొన్నారు.

Exit mobile version