NTV Telugu Site icon

Radha Madhavam: ‘నేల మీద నేను ఉన్నా’ అంటున్న ‘రాధా మాధవం’

Radhamadhavam Lyrical

Radhamadhavam Lyrical

Radha Madhavam First Lyrical Song Released: తాజాగా అలాంటి ఓ గ్రామీణ ప్రేమ కథా చిత్రం రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రమే ‘రాధా మాధవం’. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించగా ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే ఫాస్ట్ మాస్ బీట్‌ను బిగ్ బాస్ సోహెల్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

Sooreede: సూరీడే అంటున్న సలారోడు.. ఫస్ట్ సింగిల్ విన్నారా?

‘నేల మీద నేను ఉన్నా’ అంటూ సాగే ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన ట్యూన్ బాగుంది. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది, డిసెంబర్ నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి తాజ్ జీడీకే కెమెరామెన్ గా వ్యవహరించగా ఫైట్స్ రాబిన్ సుబ్బు కంపోజ్ చేశారు.