Site icon NTV Telugu

Radha Madhavam:సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రాధా మాధవం’.. మార్చి 1న విడుదల

Radha Madhavam

Radha Madhavam

Radha Madhavam Censor Completed: గ్రామీణ ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు, మరీ ముఖ్యంగా అచ్చమైన ప్రేమ కథను తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. ప్రేమకు అర్థం చెప్పేలా ప్రస్తుతం ‘రాధా మాధవం’ అనే సినిమా రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించగా వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇక రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

Delhi: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ అలర్ట్

సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని సినిమా మీద ప్రశంసలు కురిపించారని మేకర్స్ వెల్లడించారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 1న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా యూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Exit mobile version