Site icon NTV Telugu

పెళ్లి తరువాత ఏం చేస్తారు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారుతోంది. సినిమాల చూసే దృష్టి మారుతోంది.. ఒకప్పుడు బోల్డ్ సీన్లంటే.. ఏదో తప్పు చేసినట్లు చూసేవారు సైతం ఇప్పుడు కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్నారు. ప్రేక్షకుల తీరును బట్టే డైరెక్టర్లు, హీరోయిన్లు బోల్డ్ సీన్లకు ఒకే అంటున్నారు. కథకు రొమాన్స్ అవసరమైతే కొద్దిగా ఘాటుగా నటించడానికి కూడా సై అంటున్నారు. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె నటించిన ‘లవ్‌ యూ రచ్చు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పింది.

‘లవ్‌ యూ రచ్చు’ సినిమాలో కొద్దిగా ఘాటైన రొమాన్స్ చేసినట్టున్నారు.. అని రిపోర్టర్ ప్రశ్నించగా కథ డిమాండ్ చేయడంతో తప్పలేదు అని చెప్పింది. దానికి రిపోర్టర్ అంతకు ముందు ఇలాంటి బోల్డ్ సీన్స్ లో నటించనని మీడియా ముఖంగా చెప్పారు.. మరి ఇప్పుడు అలాంటి సీన్స్ లోనే కనిపించారు అని అడిగారు. అందుకు రచిత మాట్లాడుతూ ” పెళ్లి తరువాత ఎవరైనా ఏం చేస్తారు.. రొమాన్స్ కాకుండా ఇంకేమైనా చేస్తారా..? గతంలో ఉపేంద్ర తో కలిసి నటించిన చిత్రంలోని కొన్ని సీన్స్ నా కుటుంబ సభ్యులను ఇబ్బందికి గురిచేశాయి. అందుకే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకున్నాక కూడా ఈ పాత్ర ఎందుకు చేయాల్సివచ్చింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి” అని ఘాటుగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం రచిత రామ్ తెలుగులో మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ చిత్రంలో కనిపించనుంది

Exit mobile version