Raasi : ఆ కారణంతో సినిమాలకు దూరం కావాలి అనుకున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.90వ దశకంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి మెప్పించారు రాశీ.తెలుగులో అప్పటి స్టార్ హీరోల అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖ ‘దీవించండి’, ‘దేవుళ్లు’,‘పెళ్లి పందిరి’, మరియు ‘శుభాకాంక్షలు’ వంటి పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న క్రమంలోనే, బుల్లితెరపై కూడా సత్తా చాటింది. ‘గిరిజా కల్యాణం’, ‘జానకి కలగనలేదు’ వంటి పలు సీరియల్స్ లో కూడా కనిపించింది. రాశీ పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యారు..అయితే మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ‘రాఘవరెడ్డి’ అనే సినిమాలో నటించారు.ఇందులో నందితా శ్వేతకు తల్లిగా రాశీ కనిపించారు. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలు దక్కించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ.. తాను సినిమాల నుంచి దూరం కావడానికి అసలు కారణం చెప్పుకొచ్చారు…
సినిమాలకు తాను దూరం కావాలి అనుకున్నానే తప్ప, సినిమాలు తనని వద్దు అనుకోలేదని ఆమె వెల్లడించారు.. “రాశీ సినిమాలను వద్దు అనుకుంది. కానీ, సినిమాలు రాశిని వద్దు అనుకోలేదు. ఇప్పటికీ నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే, అచితూచి నిర్ణయం తీసుకుంటున్నాను. నటనా ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రను చేయడానికైనా రెడీ. తల్లిగా, అత్తగా అలాగే అక్కగా ఏ పాత్ర అయినా చేస్తాను. హీరోయిన్ గా అయితే ఇంకా మంచిది” అని చెప్పుకొచ్చారు. సినిమా అకాశాలు వచ్చినప్పటికీ అప్పట్లో కొన్ని కారణాలతో సినిమాలు చేయకూడదని భావించినట్లు రాశీ వెల్లడించింది. ఇష్టం లేకపోయినా, కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చిందన్నారు. కొన్నిసార్లు నచ్చకపోయినా చేసిన సినిమాలు ఉన్నాయి. మేకప్ వేసుకున్న తర్వాత సెట్ నుంచి రాశి వచ్చేసింది అనే పేరు రాకూడదనే నేను అలా చేశాను. నేను వృత్తికి ఎంతో గౌరవం ఇస్తాను. ‘శుభాకాంక్షలు’ సినిమాలో నన్ను చూసి చాలా మంది తిట్టుకున్నారు. అంతేకాదు, నాకు పెద్ద అభిమానిగా ఉన్న ఒకావిడ సినిమాకు వెళ్లింది. ఈ సినిమా చూస్తుండగానే ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. నా వల్ల ఓ వ్యక్తి నవ్వాలి. అంతేతప్ప, ఇబ్బంది పడకూడదు అనుకున్నాను. అప్పుడే సినిమాల నుంచి దూరం కావాలి అనుకున్నాను అని చెప్పుకొచ్చారు..
Also Read
- Sumanth: 'నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..' అంత మాట అనేశాడేంటి?
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
- Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఆ స్టార్‌తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
- Khalifa: 'ఖలీఫా' నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
తాజావార్తలు
-
CJP Protest: వెండి తెరపైకి ఢిల్లీ విద్యార్థుల ఉద్యమం.. బాలీవుడ్ సినిమా టైటిల్ ఇదే!
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
-
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!