టాలీవుడ్‌లో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికలుగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్‌గా ఇప్పటి వరకు ఎన్నో స్టార్ హీరోయిన్స్‌తో పని చేసిన నీరజా కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా మారుతున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయి, నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అందువల్ల ఈ చిత్రంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.తాజాగా కథానాయిక రాశీ ఖన్నా తన షూటింగ్ భాగాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఆమె తన ఎమోషనల్ అనుభూతులను పంచుకుంటూ ..
Also Read : Akshay Kumar : అక్షయ్ బర్త్ డేకి.. అభిమానులకు మైండ్‌బ్లోయింగ్ సర్ప్రైజ్
“కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు కొన్ని ఉంటాయి. అలాంటి కథే తెలుసు కదా. ఈ సినిమా నాకు ఒక అద్భుతమైన జర్నీ. ఈ అనుభవంలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మేం సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది. రొమాంటిక్ డ్రామాలతో పాటు భావోద్వేగాలు పుష్కలంగా నింపిన ఈ కథ ప్రేక్షకుల మనసులను తాకుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
