Raashi Khanna: తెలుగు ప్రేక్షకులు చాలా చిత్రంగా ఉంటారు. కథను బట్టి కాకుండా సెంటిమెంట్ బట్టీ ఆ సినిమా ఆడుతుందో లేదో వాళ్ళు చెప్పేస్తుంటారు. ‘ఈ సినిమాలో ఫలానా హీరోయిన్ ఉందా!? ఆమెది ఐరన్ లెగ్.. మూవీ ఆడదు’ అని రిలీజ్ కు ముందే జోస్యం చెబుతారు. అంతేకాదు.. కొందరు హీరోయిన్లు చేసే చేష్టలు బట్టి కూడా మూవీ రిజల్డ్ ను జడ్జి చేస్తుంటారు. తాజాగా అలాంటి సెంటిమెంట్ ఒకటి రాశీఖన్నా విషయంలో ప్రచారంలో ఉంది. ఈ అందాల చిన్నది ఏదైనా సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ మూవీ ఫలితం గోదాట్లో కలిసిపోయినట్టే అనే రూమర్స్ ఫిల్మ్ నగర్ లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. అందుకు తాజాగా విడుదలైన ‘థ్యాంక్యూ’ మూవీని ఉదాహరణగా చూపుతున్నారు. రాశీఖన్నా లిప్ లాక్స్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇందులో వాస్తవం ఉందేమోనని ఎవరికైనా అనిపిస్తుంది.
2013లో ‘మద్రాస్ కేఫ్’ హిందీ మూవీతో రాశీ ఖన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే లిప్ లాక్స్ తో సందడి షురూ చేసిందీ చిన్నది. జాన్ అబ్రహంతో హాట్ హాట్ సీన్స్ లో నటించడమే కాదు.. పెదవితో పెదవిని లాక్ చేసి.. కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపింది. అయినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గ బోల్తా కొట్టింది. ఆ తర్వాత తెలుగులో యంగ్ హీరో సందీప్ కిషన్ కు ‘జోరు’ మూవీలో జోరుగా లిప్ లాక్ ఇచ్చేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదే ఊపులో మాస్ మహరాజా రవితేజకు ‘బెంగాల్ టైగర్’తో పాటు ‘టచ్ చేసి చూడు’ లోనూ లిప్ లాక్స్ పెట్టేసింది. ఈ రెండు సినిమాలూ ఇంటికెళ్ళిపోయాయి. ఇక రామ్ ‘శివమ్’లోనూ, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లోనూ, గోపీచంద్ ‘జిల్’లోనూ రాశీఖన్నా లిప్ లాక్ సీన్స్ చేసింది. ఇందులో ‘జిల్’ మాత్రమే కాస్తంత ఫర్వాలేదనిపించింది. ఇక శుక్రవారం వచ్చిన నాగ చైతన్య ‘థ్యాంక్యూ’లో నటించిన రాశీఖన్నా.. అందులో అతనితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటుంది. ఆ సమయంలో చైతు అధరాలతో మధురంగా యుద్థమే చేసింది. కానీ ఏం లాభం బాక్సాఫీస్ దగ్గర ఆమె లిప్ లాక్ సెంటిమెంట్ పనిచేసి మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అసలే మన టాలీవుడ్ లో సెంటిమెంట్స్ కు పెద్ద పీట వేస్తుంటారు. ఇప్పటికే రాశి ఖన్నా ఖాతాలో సినిమాలు తగ్గిపోయాయి.
ఇకపై రాశీ ఖన్నా లిప్ లాక్ కు సై అన్నా దర్శక నిర్మాతలూ, హీరోలు.. వద్దొనటం ఖాయం. చిత్రం ఏమంటే.. రాశీఖన్నా తెలుగులోనే కాదు మలయాళంలో నటించిన సినిమా కూడా లిప్ లాక్ సెంటిమెంట్ తో ఫట్ అనేసింది. పృథ్వీరాజ్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘భ్రమం’లో రాశీఖన్నా లిప్ లాక్ ఇచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఇందుకు ఒక్క వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమా మాత్రం మినహాయింపు. ఈ సినిమా లిప్ లాక్ సెంటిమెంట్ కు అతీతంగా ఘన విజయం సాధించటం విశేషం. మరి రాబోయే రాశీఖన్నా తమిళ సినిమాలు ‘తిరుచిత్రాంబళం’, ‘సర్దార్’, హిందీ సినిమా ‘యోధ’ లో అమ్మడి లిప్ లాక్స్ ఉంటాయా? ఉంటే అవి ఎలాంటి ఫలితాలను అందుకుంటాయన్నది చూడాల్సిందే.