Site icon NTV Telugu

Rathnam : ‘రా రా రత్నం’ అంటున్న విశాల్

Ra Ra Rathnam

Ra Ra Rathnam

Ra Ra Rathnam Song From Vishal’s Rathnam Released: మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్‌గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ఈ మధ్యనే టైటిల్‌తో పాటు ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంది. అందులో విశాల్ ఇది వరకు ఎన్నడూ చూడని లుక్కులో, మాస్ అవతారంలో కనిపించాడు. తల నరికి చేత్తో పట్టుకునే ఆ సీన్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చిందనే చెప్పాలి.

V Hanumantha Rao: తొందర పడకండి.. హరీష్‌ రావ్‌ పై వీహెచ్ సీరియస్

ఇక ఇప్పుడు నూతన సంవత్సరాది ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు మేకర్స్. రా రా రత్నం అంటూ సాగే ఈ పాట రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫుల్ రేసీగా, పవర్ ఫుల్‌గా అనిపిస్తోన్న ఈ పాట లిరిక్స్, ట్యూన్, విజువల్స్ నరనరాల్లో రక్తాన్ని పరుగులు పెట్టించేలా ఉన్నాయి. వివేక్ సాహిత్యం, షేన్ భాగరాజ్ గాత్రం, దేవీ శ్రీ ప్రసాద్ బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా అనిపించాయని అనడం అతిశయోక్తి కాదు. ఇక త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ రత్నం సినిమాలో సముద్రఖని, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు.

Exit mobile version