NTV Telugu Site icon

Satyabhama: కాజల్ అగర్వాల్ కి కొత్త బిరుదు.. ఆరోజే రిలీజ్!!

Queen Of Masses Kajal

Queen Of Masses Kajal

Kajal Aggarwal’s “Satyabhama” grand theatrical release on May 17th: క్వీన్ ఆఫ్ మాసెస్ అంటూ కాజల్ అగర్వాల్ కి కొత్త బిరుదు ఇచ్చిన సత్యభామ మేకర్స్ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. కాజల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమాను మే 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తుండగా “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు.

Fire Accident: టాలీవుడ్‌కి షాక్.. షూట్‌కి ముందు స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం!

క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఇక “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం డిజైన్ చేసిన వీడియోఅయితే క్రియేటివ్ గా ఉంది. క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా అది క్యాలెండర్ లో మే 17 డేట్ ను టార్గెట్ చేస్తూ కనిపిస్తోంది అలా మే 17న “సత్యభామ” సినిమా రిలీజ్ ను ఇలా ఇన్నోవేటివ్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా “సత్యభామ” సినిమా సూపర్ హిట్ అవుతుందనే అంచనా వేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా సంగీతం శ్రీ చరణ్ పాకాల అందిస్తున్నారు.

Show comments