Site icon NTV Telugu

Raviteja: రావణాసుర ట్రాన్స్ నుంచి బయటకి వచ్చి కాస్త లవ్ ని ఎంజాయ్ చెయ్యండి

Raviteja

Raviteja

బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో మాస్ మహారాజ్ రవితేజ మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజ ఫాన్స్ ఉన్నంత జోష్ లో మరే హీరో ఫాన్స్ ఉండరు. రెండు నెలలు తిరగకుండానే రెండు వంద కోట్ల సినిమాలని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చిన రవితేజ ఇదే జోష్ లో మరో హిట్ ఇచ్చి సమ్మర్ లో హీట్ పెంచడానికి ‘రావణాసుర’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న రావణాసుర సినిమా నుంచి ఇటివలే ‘రావణాసుర ఆంథెమ్‌’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రావణాసుర ఆంథెమ్‌’ని ఒక ట్రాన్స్ లా డిజైన్ చేసి కంపోజ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోనో, హోమ్ థియేటర్ ఆన్ చేసుకోనో ఈ రావణాసుర ఆంథెమ్‌ సాంగ్ ని వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.

తాజాగా ‘రావణాసుర’ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అభిషేక్ పిక్చర్స్ అనౌన్స్ చేశారు. హై ఎనర్జీ సాంగ్ తో డాన్స్ ఫ్లోర్ ని ఊపెయ్యడానికి రెడీగా ఉండండి అంటూ బయటకి వచ్చిన ‘ప్యార్ లోనే పాగల్’ అనే సాంగ్ ని ఫిబ్రవరి 18న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సాంగ్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో రవితేజ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, దక్షా నగార్కర్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న రావణాసుర సినిమాలో ఈ ప్యార్ లోన పాగల్ అనే సాంగ్ ఏ హీరోయిన్ పైన డిజైన్ చేశారు అనేది చూడాలి. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రవితేజతో పాటు సుశాంత్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

Exit mobile version