సింధూరం, ఖడ్గం, మహాత్మా, మురారి లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తెరకెక్కించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగమార్తాండ’. కృష్ణవంశీ ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ మరాఠీలో హిట్ అయిన ‘నట సామ్రాట్’ అనే సినిమాకి రీమేక్ వర్షన్. తనకి సినిమాపై ఉన్న ప్రేమనంతా పెట్టి ‘రంగమార్తాండ’ సినిమా చేస్తున్నాడు కృష్ణవంశీ. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ట్రంప్ కార్డ్ ఉంటుంది, కష్టం వచ్చినప్పుడు, ఆపద సమయంలో ఆ ట్రంప్ కార్డ్ ని వాడి లైఫ్ ని కాపాడుకుంటూ ఉంటాం. ఇలాంటి ట్రంప్ కార్డ్ కృష్ణవంశీ లైఫ్ లో కూడా ఉంది, దాని పేరు ప్రకాష్ రాజ్. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ కలిస్తే తెరపై అద్భుతాలు జరిగుతాయి. ఖడ్గం సినిమానే అందుకు అతిపెద్ద ఉదాహరణ. ప్రస్తుతం కెరీర్ కష్టాల్లో ఉన్న కృష్ణవంశీ, హిట్ ట్రాక్ ఎక్కడానికి రంగమార్తాండ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్.
మన అమ్మ నాన్నల కథ అంటూ రూపొందుతున్న ఈ మూవీలో బ్రహ్మానందం ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ పాత్రతో బ్రహ్మీ, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరినీ ఎమోషనల్ గా చేస్తాడట. రమ్యకృష్ణ మరో స్పెషల్ రోల్ లో కనిపించనున్న రంగామార్తాండ సినిమా నుంచి ‘పువ్వై విరిసే’ అనే సాంగ్ బయటకి వచ్చింది. ఇళయరాజా ట్యూన్ ఇవ్వడమే కాకుండా, తనే ఈ పాటని పాడడం విశేషం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇప్పుడు లేరు కానీ ఆయన రాసిన ఈ పాట మాత్రం మన అందరికీ ఆయన్ని గుర్తు చేస్తుంది. కృష్ణవంశి, ఇళయరాజా, సిరివెన్నెల… ఈ పేర్లు వింటే చాలు ‘పువ్వై విరిసే’ పాట ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించడానికి. ఆ ఊహకి ఏమాత్రం తక్కువ కాకుండా సాంగ్ ని ఇచ్చారు చిత్ర యూనిట్, ఒకసారి వినీ ఎంజాయ్ చెయ్యండి.
