రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు ఆనంద్ దేవరకొండ.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రంతో హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ఈ సినిమ ట్రైలర్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.గవర్నమెంట్ స్కూల్ లో లెక్కల టీచర్ గా పనిచేసే సుందర్(ఆనంద్ దేవరకొండ) కి ఊర్లో హీరోయిన్ తో పెళ్లవుతుంది. పెళ్లైన ఎనిమిది రోజులకే పట్నంలో మకాం పెట్టిన సుందర్ కి భార్య టోకరా వేసి ఇంట్లో నుంచి వేరొకరితో లేచిపోతుంది. భార్య లేచిపోయిందని బయట చెప్తే పరువుపోతుందని, ఇంట్లో భార్య ఉన్నట్లే మేనేజ్ చేయడానికి ఎలాంటి తంటాలు పడాడు అనేది ఈ ట్రైలర్ లో ఫన్నీగా చూపించారు. ఇక మధ్యలో భార్య జిమ్ చేసే కుర్రాడితో లేచిపోయిందని తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టడం, అక్కడ సునీల్ కి తన కథను వివరించడం, దాని పరిణామాలు ఏంటి ..? అనేది కథగా తెలుస్తోంది. అసలు భార్య లేచిపోవడానికి కారణాలు ఏంటి..? చివరికి సుందర్ తన భార్యను కనిపెట్టాడా..? లేదా ..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
లెక్కల మాస్టర్ గా ఆనంద్ దేవరకొండ నటించాడు అనడం కన్నా జీవించాడు అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. పెళ్లి తర్వాత ఓ మిడిల్ క్లాస్ యువకుడి లైఫ్ లో జరిగిన వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే సినిమా టైటిల్ కి, కథకు సంబంధం ఏంటి అనేది మిస్టరీగా మారింది. ట్రైలర్ లో ఎలాంటి హింట్ కూడా ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా నవంబర్ 12 న విడుదల కానుంది. మరి ఆనంద్ దేవరకొండ మరో హిట్ అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.
