NTV Telugu Site icon

Pushpa 2 Re Loaded : హమ్మయ్య.. ఆ లోటు తీరింది!

యాడ్ చేశారు

యాడ్ చేశారు

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే దానికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్’ అనే సినిమాని రూపొందించారు మేకర్స్. ఈ సినిమా 2024 డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకొచ్చింది. వచ్చిన మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రీలోడేడ్ వర్షన్ ఒకదాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు.

నిజానికి 11వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు కొన్ని కారణాలతో వాయిదా వేసి ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత ‘పుష్ప 2’ డిసెంబర్ లో రిలీజ్ అయినప్పుడు చాలామంది ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేంటంటే మొదటి భాగంలో హీరో చిన్నప్పుడు అతని అన్నగా ఉన్న అజయ్ మెడలో నుండి ఒక గొలుసు లాక్కుంటాడు. రెండో భాగం చివరిలో పుష్పను కుటుంబం కలుపుకున్న తర్వాత ఆ గొలుసు అజయ్ చేత మెడలో వేయించి ఉంటే బాగుండేదని అందరూ భావించారు. అయితే ఈ సీన్ సినిమాలో లేదు ఇక ఉండదు అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి సోషల్ మీడియా కామెంట్స్ ని బేస్ చేసుకుని చేశారో లేకముందే ట్రిమ్ చేసుకున్న దాన్ని కావాలని కలిపారో తెలియదు కానీ తాజాగా దానిని యాడ్ చేశారు. దీంతో ప్రేక్షకులు భావించిన లోటు ఇప్పుడు తీరిపోయిన ఫీలింగ్ కలుగుతోంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఒక స్పెషల్ సాంగ్ లో శ్రీ లీల మెరిసింది.