NTV Telugu Site icon

పుష్ప’ రాజ్ ను వాడేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం!

రెండు రోజుల క్రితమే అమూల్ సంస్థ ‘పుష్ఫ’ మూవీ హీరో పాత్రను ఉపయోగిస్తూ, ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కాస్తంత సంచలనం సృష్టించిన అంశాలు కనిపిస్తే చాలు వాటిని ప్రకటనలుగా మార్చి, దేశ వాప్తంగా హోర్డింగ్స్ లో పెట్టడం అమూల్ సంస్థకు కొత్తకాదు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం ‘పుష్ప’ను కరోనా అవేర్ నెస్ కార్యక్రమాలకు ఉపయోగించేస్తోంది. అందులోని ‘తగ్గేదేలే’ డైలాగ్ కు వచ్చిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, ఈ రకంగా సరికొత్త పోస్టర్స్ వేసే ప్రచారం చేస్తోంది. సినిమాలో హీరో ఎర్ర చందనం స్మగ్లరే అయినా… ఇప్పుడు మాత్రం అతని పాపులారిటీ మంచికే ఉపయోగపడుతోంది! మరి ‘పుష్ప’ రాజ్ స్పూర్తితో ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు తీసేదే లే! అని జనం నిజంగా అనుకుంటే… వాళ్ళందరికీ మేలు జరిగినట్టే!