“పుష్ప”రాజ్ ఆల్ టైం రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా మూవీ “పుష్ప” నుంచి నిన్న “దాక్కో దాక్కో మేకా” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషలలో విడుదలైంది. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు), బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో పాడారు. అల్లు అర్జున్ కఠినమైన లుక్, మినిమలిస్టిక్ డ్యాన్స్ కదలికలు ఈ పాటలో హైలైట్. ఐకాన్ స్టార్ సాధారణంగా తెరపై చాలా ఉత్సాహంగా కన్పిస్తాడు. కానీ “పుష్ప”లో మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన, క్రూరమైన లుక్ లో కన్పించాడు. పాట బీట్లు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, సంగీతం, సాహిత్యం కొన్ని చోట్ల తడబడ్డట్టుగా అన్పించింది. పాట ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంది.
Read Also : నాగశౌర్య ‘లక్ష్య’లో రితికాగా మెస్మరైజ్ చేసిన కేతిక!
Also Read
- The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. 'ది ఒడిస్సీ'కి అదిరిపోయే ఓపెనింగ్!
- Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్‌కు మరో అరుదైన రికార్డు!
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
వీడియో యానిమేషన్, ఎడిటింగ్ అగ్రస్థానంలో ఉన్నాయి. మిరోస్లా క్యూబా బ్రోజెక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంగీతం కంటే విజువల్స్ కారణంగా ఈ పాట రికార్డులు కొల్లగొడుతోంది. విడుదలైన 371 మినిట్స్ లో 500కే వ్యూస్ తో ఆల్ టైం రికార్డు సృష్టించాడు “పుష్ప”రాజ్. ప్రస్తుతం ఈ వీడియో 1 మిలియన్ లైక్స్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 5 భాషల్లో కలిపి 10 మిలియన్ కు పైగా వ్యూస్ సాధించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప : ది రైజ్ పార్ట్ 1” 2021 క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్‌లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!