Site icon NTV Telugu

షాకింగ్ : “పుష్ప” మరో లీక్… వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే!!

Allu Arjun Remuneration for Pushpa Movie

“పుష్ప”కు లీకుల విషయం పెద్ద తలనొప్పిగా మారింది. పైరసీ రాయుళ్ల చేతలు “పుష్ప”రాజ్ కు కొరకరాని కొయ్యగా మారిపోయాయి. “పుష్ప” ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా లీకు రాయుళ్లను హెచ్చరించారు. ఆ కాసేపటికే “పుష్ప”లో దాదాపు 20 సెకన్ల ఫైటింగ్ సీక్వెన్స్ ను లీక్ చేసి షాకిచ్చారు. ఈ లీకైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల కీలక సమావేశం

అంతగా క్లారిటీ లేని ఈ వీడియోలో అల్లు అర్జున్ మెటల్ కుర్చీతో విలన్లను చితక్కొట్టడం కనిపిస్తుంది. చాలా కాలం క్రితం, సర్కారు వారి పాట టీజర్ యొక్క చిన్న భాగం షెడ్యూల్ చేయబడిన విడుదలకు కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు నిర్మాణ సంస్థపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి లీకులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Exit mobile version