Pushpa-3 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప-1, పుష్ప-2 భారీ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ ను ఊపేశాయి. దీనికి సీక్వెల్ గా పార్ట్-3 ఉంటుందని గతంలోనే చెప్పారు. సెకండ్ పార్ట్ చివర్లో ఓ బాంబు పేల్చి హింట్ ఇచ్చేశారు. తాజాగా సైమా అవార్డుల వేదికలో సుకుమార్ కచ్చితంగా పుష్ప-3 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ పార్ట్-3 ఎప్పుడు ఉంటుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఉంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Also : Sandeep Reddy : బాహుబలి-2లో ప్రభాస్ ను చూసి భయపడ్డా.. సందీప్ కామెంట్స్
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో భారీ సినిమా చేస్తున్నాడు. అది పూర్తి అయ్యే సరికి ఇంకో రెండేళ్లు పట్టేలా ఉంది. ఈ లోగా సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది మూవీలో బిజీగా ఉన్నాడు. అది వచ్చే సమ్మర్ నాటికి అయిపోతుంది. ఆ తర్వాత సుకుమార్ తో మూవీ ఉంటుంది. ఆ మూవీ అయిపోయేసరికి ఎంత లేదన్నా రెండేళ్లు పడుతుంది. అంటే 2028 నాటికి సుకుమార్-రామ్ చరణ్ మూవీ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బన్నీ-అట్లీ మూవీ ఆ లోపే అంటే 2027 వరకు అయిపోతుంది. ఈ లెక్కన బన్నీ ఏడాది పాటు సుకుమార్ కోసం వెయిట్ చేస్తే.. వీళ్ల కాంబో ఫిక్స్ అవుతుంది. ఆ సినిమా వచ్చేసరికి ఎంత లేదన్నా 2030 వస్తుందేమో.
Read Also : SSMB 29 : రాముడిగా మహేశ్ బాబు.. జక్కన్న ఏంటి నీ ప్లాన్..
