NTV Telugu Site icon

Pushpa 2: అనుకున్నట్టే అయింది.. డిసెంబర్ కి పుష్ప 2 వాయిదా

Pushpa 2 News

Pushpa 2 News

Pushpa 2 The Rule Grand release worldwide on 6th DECEMBER 2024: అనుకున్నదే అయింది, ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమా రావడం లేదంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించింది. డిసెంబర్ 6వ తేదీన 2024 భారీ ఎత్తున సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నామంటూ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అంతేకాదు పుష్ప సక్సెస్ తర్వాత పుష్ప 2 సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్నారని అయితే ఆ ఎదురుచూపులే తమ మీద బాధ్యతను మరింత పెంచాయని సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. ముందు ప్రకటించినట్టుగానే నిరంతరం పనిచేస్తూ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశాము. అయితే ఇంకా షూట్ మిగిలి ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనికి కూడా సమయం పడుతూ ఉండడంతో ఆగస్టు 15న సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నామని ప్రకటించింది.

Darshan: ‘నన్ను వదిలేయండి’ ప్లీజ్.. పోలీసుల కాళ్లపై పడ్డ దర్శన్?

ఈ నిర్ణయాన్ని ప్రేక్షకులు అలాగే అందరి అభిప్రాయాల మేరకు తీసుకున్నామని చెప్పుకొచ్చింది. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చింది. తమ టీజర్ కి అలాగే ఇప్పటికీ విడుదలైన పాటలకు అన్ని భాషలలో అద్భుతమైన స్పందన వస్తోందని అందుకే క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఇక పుష్ప 2 రిలీజ్ డేట్ మారడంతో తెలుగు సినీ పరిశ్రమలో చాలా సినిమాలు రిలీజ్ డేట్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అదేరోజు నాని సరిపోదా శనివారం సినిమా కూడా బరిలో దిగే అవకాశం ఉంది. చూడాలి ఇంకెన్ని సినిమాల రిలీజ్ డేట్లు మారతాయి అనేది