NTV Telugu Site icon

Pushpa 2 Teaser: ఇది కదా అరాచకం అంటే.. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న పుష్ప రాజ్!

Pushparaj Stuns The Nation

Pushparaj Stuns The Nation

Pushpa 2 Teaser getting Huge Response: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన మరోసారి హీరోయిన్ గా కనిపించబోతోంది. అల్లు అర్జున్ కూలీ నుంచి ఎర్రచందనం స్మగ్లర్ స్థాయికి ఎదిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఇంటర్నేషనల్ లెవెల్ లో పుష్ప రాజుగా అల్లు అర్జున్ ఏం చేశాడు? అనే విషయాలను రెండో భాగంలో చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఎంతవరకు పూర్తయితే అంతవరకు సినిమా రిలీజ్ చేయాలని ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు.

Bhimaa OTT Official: ‘భీమా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్..!

వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని, ఒకవేళ పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఆగస్టు 15 వరకు ఎంతవరకు పూర్తయితే అంతవరకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు గంగమ్మ జాతర నేపథ్యంలో సాగుతున్న ఒక ఫైట్ కి సంబంధించిన చిన్న వీడియో బిట్ని టీజర్ పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ బిట్ పెద్దగా ఆకట్టుకోలేదని, ప్రేక్షకులకు కొత్తగా ఏమీ చూపించలేదని కొంతమంది కామెంట్ చేస్తుంటే ఈ మాత్రం చాలు సంచలనాలు సృష్టించడానికి అని అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ టీజర్ వ్యూస్ మాత్రం అరాచకం అనే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు సినిమా యూనిట్ ప్రకటించిన దాని మేరకు 24 గంటల్లో దాదాపు 85 మిలియన్ల రియల్ టైం వ్యూస్ సాధించిన ఈ టీజర్ మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది

Show comments