NTV Telugu Site icon

Pushpa Teaser Record: పుష్ప -2 టీజర్ ఆల్ టైం రికార్డ్.. అస్సలు తగ్గేదేలే!

Pushpa Teaser Record

Pushpa Teaser Record

Pushpa 2 Teaser Creates all time Record: తెలుగు మాత్రమే కాదు అలా అని ఇండియా వైడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప‌:2 ది రూల్’. ‘పుష్ప ది రైజ్‌’తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోగా ఇప్పుడు రెండో భాగం కోసం ఎదురుచూస్తునాన్రు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌ల‌యిక‌లో రాబోతున్న పుష్ప‌-2 ది రూల్‌పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాలు ఉన్నాయి. ఏప్రిల్ 8, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ టీజర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప్‌లో వీర మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఏ హీరో కనిపించని విధంగా ఊర మాస్ అవతార్‌లో కనిపించి.. సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు బన్నీ. తిరుపతి గంగమ్మ జాతరలో వచ్చే సన్నివేశంతో టీజర్ కట్ చేసిన విధానం.. అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

Pushpa Teaser: అది సార్ నా బ్రాండ్.. ఏకంగా గూగుల్ తల్లే సలాం కొట్టిందిగా!!

అల్లు అర్జున్ ఇందులో చీరకట్టి.. కాలు వెనక్కి మడిచి పైట కొంగుని అందుకున్న తీరు చూస్తుంటే.. ‘పుష్ప2: ద రూల్’ కూడా నీయవ్వ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుందనే హింట్‌ని ఇచ్చేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ లుక్, యాటిట్యూడ్, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ప్రపంచ సినీ ప్రేక్షకులంతా మరోసారి పుష్పరాజ్‌ గురించి మాట్లాడుకునేలా చేస్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ పార్ట్ 2లో అల్లు అర్జున్ విశ్వరూపం చూడబోతున్నారనేది ఈ టీజర్‌తో మరోసారి సుస్పష్టమైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ల మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ ‘పుష్ప-2’ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 101 నిమిషాల్లోనే టీజర్ వీడియోకు 500K లైక్స్ వచ్చాయి. ఇక అత్యంత వేగంగా ఐదు లక్షల లైక్స్ సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు.

Show comments