NTV Telugu Site icon

Pushpa 2: మార్కెట్లో మెంటలెక్కిస్తున్న పుష్ప 2 క్రేజ్.. మొత్తం అన్ని వందల కోట్లా?

Pushpa 2

Pushpa 2

Pushpa 2 Craze in Business Became hot topic in Cinema trade: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మార్కెట్లో అతని ఫాలోయింగ్ చూస్తుంటే… మెంటల్ వచ్చేస్తుంది’ అనేది సినిమాలో రావు రమేష్ చెప్పే డైలాగ్. ఇప్పుడు అదే డైలాగ్ సరిగ్గా అల్లు అర్జున్ కి సరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పుష్ప 2 సినిమాకు సంబంధించి జరుగుతున్న బిజినెస్ పరిశీలిస్తే ఈ మాట అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమా నార్త్ బెల్ట్ లో ఒక రేంజ్ పెర్ఫార్మన్స్ చేసి తెలుగులో కంటే ఎక్కువ కలెక్షన్లు అక్కడ నుంచే రాబట్టింది. ఇది ఏమాత్రం ఊహించని సినిమా యూనిట్ రెండో భాగాన్ని మరింత పెద్దదిగా, ఇండియా వైడ్ ప్రేక్షకులందరూ ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే బిజినెస్ మొదలైపోయింది.

MAD Square: మొన్న టిల్లు స్క్వేర్.. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్

నార్త్ థియేటర్ రైట్స్ అనిల్ తడానీతో కలిసి కరణ్ జోహార్ భారీ రేటు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక అన్ని భాషల ఓటీటీ రైట్స్ 250 నుంచి 300 కోట్లు పలుకుతుండగా ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ రైట్స్ కూడా టి సిరీస్ సంస్థ కొనుగోలు చేసిన వార్త వెలుగులోకి వచ్చింది. కేవలం ఆడియో రైట్స్ కోసమే 65 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఇంకా సౌత్ అలాగే ఓవర్సీస్ బిజినెస్ జరగలేదు కానీ ఇప్పటికే జరిగిన డిజిటల్ నార్త్ ఇండియన్ థియేటర్ రైట్స్, ఓటీటీ, మ్యూజిక్ రైట్స్ తో దాదాపు 540 కోట్లు పుష్ప మేకర్స్ కి వచ్చినట్లుగా చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొత్తగా బెంగాలీ భాషలో కూడా సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద పుష్ప 2 క్రేజ్ తో పాటు అల్లు అర్జున్ క్రేజ్ కూడా చూస్తుంటే ఈ సినిమా అనేక సంచలన రికార్డులను నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది.