డిఫరెంట్ ప్రమోషన్స్‌తో ‘పురుష:’ చిత్రయూనిట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాని నిర్మించారు. పక్కా ఫ్యామిలీ కథ, భార్యాభర్తల చిలిపి తగాదాలతో ఎంటర్టైన్ చేయడానికి ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ‘పురుష:’ మూవీ రాబోతోంది. వీరు వులవల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కానున్నారు. హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రల్ని పోషించారు.
Also Read:Love Marriage: మూడు రోజుల క్రితం లవ్ మ్యారేజ్.. కట్ చేస్తే.. హాస్పిటల్ బెడ్ పై..!
మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌లో బజ్‌ను, హైప్‌ను క్రియేట్ చేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘దేవ నాయకి’ అంటూ సాగే మంచి ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ మంచి పెప్పీ ట్యూన్‌ను అందించారు. సాహితి చాగంటి గాత్రం ఈ పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ పాటకు భాను మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు, అమైరా దస్తూర్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఇలస పులస ఎలా అయిందో తెలియాలంటే ఈ పాటను వినాల్సిందే, చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
