Site icon NTV Telugu

Exclusive : పూరి జగన్నాథ్ – సేతుపతి సినిమా నుండి పూరి కనెక్ట్స్ ఔట్

Puri Vijay

Puri Vijay

ఒకప్పుడు పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చాడు పూరి జగన్నాథ్. కానీ ఇప్పుడు ఒక హిట్ అందించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చాడు అనుకునేలోగా ‘లైగర్’ వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. ఇక బౌన్స్ బ్యాక్ అవాలని తాను డైరెక్ట్ చేసిన హిట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించా డు పూరి. కానీ ఈ సినిమతో పూరి జగన్నాథ్ ప్రభావం పూర్తిగా కోల్పోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.

Also Read : Mega Star : వ్యోమగాముల రాకనుద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

ఈ నేపథ్యంలో పూరితో సినిమా చేసేందుకు హీరోలెవరు ముందుకు రాకపోవడంతో తమిళ హీరోను లైన్ లో పెట్టాడు. మహారాజ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు బెగ్గర్ అనే వర్కింగ్ టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అయితే గత కొన్నేళ్లుగా పూరి సినిమాలు అన్ని ఆయన సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్ పైనే ఛార్మి నిర్మాతగా నిర్మించే వారు. అయితే ఇప్పుడు పూరి డైరెక్ట్ చేయబోతున్న ‘బెగ్గర్’ సినిమాను పూరి కనెక్ట్స్ పై చేయట్లేదని సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతో కెవిఎన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ నటిస్తున్న జననయగన్ ను కూడా ఈ సంస్థే నిర్మిస్తోంది.

Exit mobile version