డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిటైర్ అవుతున్నాడా ..? అంటే అవుననే మాట వినిపిస్తుంది. అయితే అందులో మినహాయింపు కూడా ఉందని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. బద్రి సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఆయన తీసిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా మిగిలిపోయాయి. ఇక దర్శకుడిగా బిజీగా ఉన్నప్పుడే నిర్మాతగా వైష్ణో అకాడమీ, పూరి కనెక్ట్స్ సంస్థలను స్థాపించి సొంతగా సినిమాలను నిర్మిస్తున్నారు పూరి. ఇక ఇటీవలే రొమాంటిక్ సినిమాతో కొడుకు ఆకాష్ పూరి ని హిట్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కానీ అది కూడా బోల్తా కొట్టింది.
ఇక ప్రస్తుతం పూరి కనెక్ట్స్ లో పాన్ ఇండియా సినిమాలైన లైగర్, జనగణమన రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బ్యానర్ గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే .. పూరి, పూరి కనెక్ట్స్ సంస్థ నుంచి రిటైర్ అవుతున్నాడట.. ఆ బాధ్యతలను కూతురు పవిత్రకు అప్పగిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి కొడుకు ఆకాష్, కూతురు పవిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కొడుకు హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. కూతురిని హీరోయిన్ గా చేసే ఆలోచనలు లేకపోయినా ఆమెను కూడా ఇండస్ట్రీలోనే ఉంచాలని చూస్తున్నాడట .. అందుకే పవిత్రను నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడట.ఇక నిర్మాత బాధ్యతలను తప్పుకున్నాకా పూర్తిగా డైరెక్టర్ గా ఉండిపోతాడట. అసలు ఈ వార్తలో నిజం ఎంత..? అబద్దం ఎంత అనేది పక్కన పెడితే అయితే ఇందులో రెండు విషయాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది.. పవిత్ర ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అమ్మాయి.. అలాంటి ఆమెకు ఒకేసారి అంత పెద్ద బాధ్యతను ఇస్తే తట్టుకోగలుగుతుందా..? అనేది ఒకటి కాగా .. ఇక రెండోది పూరి కనెక్ట్స్ లో ఛార్మి ఒక భాగస్వామి.. మరి ఈ విషయమై ఆమె ఎలా స్పందిస్తుంది అనేది రెండోది.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.