Site icon NTV Telugu

Puri Jagannadh: పూరి అంత ఈజీగా వదిలిపెట్టాడా?

Puri Jagannadh New Heroine

Puri Jagannadh New Heroine

డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటేనే.. ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత గట్టిగా కొట్టినా గోడకేసిన బంతిలా డబుల్ ఫోర్స్‌తో వెనక్కి వస్తునే ఉంటాడు… తన హీరోలను కొత్తగా చూపిస్తునే ఉంటాడు కానీ పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం జనగణమననే. ఈ ప్రాజెక్ట్‌ను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు పూరి బట్ ఎందుకో కుదరడం లేదు. మహేష్ బాబుకి పోకిరి, బిజినెస్ మేన్ లాంటి ఇండస్ట్రీ ఇచ్చిన పూరి… తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కూడా మహేష్ బాబుతోనే చేయాలనుకున్నాడు. ఈ కాంబో వర్కౌట్ అయితే చూడాలని పూరి, మహేష్‌ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు. మహేష్ కాదనడంతో… ఫైనల్‌గా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జనగణమన మొదలు పెట్టాడు పూరి.

లైగర్ సినిమా సెట్స్ పై ఉండగానే జనగణమన షూటింగ్ స్టార్ట్ చేసి ఒకటి అర షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశాడు. లైగర్ రిజల్ట్ ఈ ప్రాజెక్ట్ అటకెక్కేలా చేసింది. విజయ్ దేవరకొండ, పూరి ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు పూరి. ఈ సినిమాతో ఎలాగైనా సరే సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. అయితే.. ఇదిలా ఉండగానే జనగణమన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూరి ఈ సినిమాను పూర్తిగా పక్కకు పెట్టలేదట. లేట్ అయినా పర్లేదు కానీ… ఎట్టి పరిస్థితుల్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేయడమే పూరి టార్గెట్ అని తెలుస్తోంది. కాకపోతే విజయ్‌ దేవరకొండ ప్లేస్‌లో మరో హీరోతో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. కుదిరితే బాలీవుడ్ హీరోతో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మరి పూరి జనగణమన ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో చూడాలి.

Exit mobile version