Site icon NTV Telugu

puri Jagannadh : అది ఎక్కువైతే పతనం అవుతాం.. పూరీ జగన్నాథ్ పాఠాలు..

Puri

Puri

puri Jagannadh : మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల పరంగానే కాదు.. ఆయన చెప్పే ఎన్నో జీవిత పాఠాలకు ఎంతో మంది అడిక్ట్ అయిపోయారు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో ఆయన మానవ జీవితంలోని అనేక విషయాలపై మాట్లాడుతుంటాడు. తాజాగా ఈగో మీద మాట్లాడారు. ‘మన మైండ్ లో ఇంకొకడు ఉంటాడు. వాడి పేరే ఈగో. వాడు మనల్ని అస్సలు ప్రశాంతంగా ఉండనివ్వడు. మన మైండ్ కు వాడే రారాజు. వాడు చెప్పిందే మనం పాటిస్తాం. అది మంచి అయినా, చెడు అయినా. వాడిని అస్సలు తగ్గించాలని అనుకోం. అందుకే వాడు మనల్ని డైరెక్ట్ చేసేస్తాడు.
Read Also : Peddi: సైలెంటుగా ‘పెద్ది’ షూట్.. ఎక్కడంటే?

అందరికంటే ముందు మనకే గౌరవం ఇవ్వాలంటాడు. మనల్ని దాటేసి ఎవడు వెళ్లినా ఒప్పుకోడు. ముందు మనకే వడ్డించాలి కదా, మనకు చెప్పి చేయాలి కదా, మనల్ని అడిగి తీసుకోవాలి కదా, అందరి ముందు మనల్ని పొగడాలి కదా.. ఇలాంటి వాటితో మనల్ని నిత్యం కాల్చుకు తింటాడు. వాడిని సాటిస్ ఫై చేయడంలో మనల్ని మనం కోల్పోతాం. ఒకరి ముందు తగ్గి సారీ చెప్పడానికి వాడు అస్సలు ఒప్పుకోడు. మనల్ని కంట్రోల్ లో ఉండనివ్వడు. ఆ ఈగో గాడు ఒక రకంగా మంచివాడే. కానీ ఈగో ఎక్కువ అయితేనే మనం పతనం అవుతాం’ అంటూ చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్.
Read Also : Pawandeep Rajan : ఇండియన్ ఐడల్ విన్నర్ కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

Exit mobile version