Puri Jagannadh and Charmme ఇద్దరూ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా షూటింగ్ సెట్లో సందడి చేశారు. ’83’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” సెట్స్‌లో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్, నిర్మాత ఛార్మీ కౌర్ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను, అలాగే దర్శకనిర్మాత కరణ్ జోహార్‌లను కలుసుకున్నారు.
Read Also : MB Foundation : మరో పసి హృదయాన్ని కాపాడిన డాక్టర్లు
ఈ సందర్భంగా కరణ్ జోహార్, రణ్వీర్ సింగ్, ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే… పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న “జనగణమన” స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా “లైగర్” విడుదలకు సిద్ధమవుతోంది. పూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా, ఆగష్టు 25న “లైగర్” థియేటర్లలోకి రానుంది.
