Nirvair Singh: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ దుర్మణం పాలయ్యాడు. పంజాబీ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ అయిన నిర్వేయర్ సింగ్ ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్ళాడు. నేటి ఉదయం మెల్‌బోర్న్‌లో బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్డు వద్ద 3.30 గంటల సమయంలో ఆయన కారును వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్వేయర్ సింగ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో పంజాబీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది.
9 ఏళ్ళ క్రితం నిర్వేయర్ సింగ్ సంగీతం నేర్చుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక మ్యూజిక్ కార్యాలయం కూడా ఉంది. దీంతో ప్రతి సారి ఆస్ట్రేలియా వెళ్తూ వస్తూ ఉంటాడు. ఇక పంజాబీ సినిమాల్లో ఆటను పాడిన పాటలు చాలా ఫేమస్ అయ్యాయి. సింగర్ గా, ర్యాపర్ గా ఎన్నో రికార్డులు కూడా కొల్లగొట్టాడు. ఇక ఈ విషయం తెలియడంతో అతని అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిర్వేయర్ సింగ్ కు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
