Site icon NTV Telugu

8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన పునీత్… ఎవరి కోసమంటే !!

Puneeth

Puneeth

పునీత్ రాజ్‌కుమార్ మరణం ఆయన అభిమానులతో పాటు మొత్తం దక్షిణ భారత చలన చిత్ర వర్గానికి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కన్నడ సూపర్ స్టార్ మరణించిన 10 రోజుల తరువాత కూడా ప్రతిరోజూ వేలాది మంది ప్రజలు ఆయన సమాధిని సందర్శించడానికి, అంతిమ నివాళులు అర్పించడానికి తరలి వస్తున్నారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ వీడియోను షేర్ చేసిన ఆయన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ అన్ ఫర్గెటబుల్ మెమొరీస్ అంటూ పునీత్ ను తలచుకున్నారు.

Read Also : “భీమ్లా నాయక్” రన్ టైమ్ ఎంతంటే ?

ఇదిలా ఉండగా పునీత్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పునీత్ కేవలం వెండితెరపైనే హీరో కాదు నిజ జీవితంలోనూ సూపర్ హీరో అన్పిస్తుంది ఈ విషయం తెలిశాక. తాజా సమాచారం ప్రకారం పునీత్ తన దాతృత్వ ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లడానికి గతంలో 8 కోట్ల రూపాయల మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూపంలో డిపాజిట్ చేశాడు. ఇప్పుడు పునీత్ మరణించడంతో ఆ మొత్తాన్ని ఆయన ఆధ్వర్యంలో నడిచిన 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, గతంలో ఆయన నిర్వహించిన 45 పాఠశాలలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబోతున్నారట. అయితే రూ. 8 కోట్ల డిపాజిట్ గురించి పునీత్ కుటుంబం ఇంకా స్పందించలేదు. కాగా తమిళ నటుడు విశాల్ వచ్చే ఏడాది నుండి పునీత్ చదివిస్తున్న 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తానని ప్రమాణం చేశాడు.

Exit mobile version