Site icon NTV Telugu

Punarnavi Bhupalam: బిగ్ బ్రేకింగ్.. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తెలుగు హీరోయిన్..

Punnu

Punnu

Punarnavi Bhupalam: ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అచ్చతెలుగు అమ్మాయి పునర్నవి. హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన పునర్నవి ఆ సినిమా హిట్ అవ్వడంతో మంచి అవకాశాలనే అందుకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో హాట్ కంటెస్టెంట్ గా లోపలి వెళ్లిన పునర్నవి.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపినట్లు చూపించడంతో మరింత ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి వచ్చాకా ఎందుకో ఏమో, ఒక చిన్న విరామం లాంటి చిన్న సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇకపోతే తాజగా ఆమె కొత్త ఏడాది అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఆమె అనారోగ్యం పాలయ్యినట్లు తెలిపింది.

గత కొన్ని రోజులుగా ఆమె ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ” కొత్త ఏడాదిని అనారోగ్యంతో ప్రారంభిస్తున్నాను. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నా.. నేను అనారోగ్యం బారిన పాడడం ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నా..” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంత చిన్న వయస్సులో పునర్నవి ఇలాంటి సమస్యతో బాధపడుతుండడం చాలా బాధాకరమని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version