ఓటీటీల ఆదరణ పెరిగిపోవడంతో మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సరికొత్త కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళి సినిమాలకు ఇక్కడ ప్రేక్షకులలో బాగా డిమాండ్ పెరిగింది..తెలుగు ప్రేక్షకులను అలరించడానికి తాజాగా మరో మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.ఈ సినిమా పేరు పులిమడ. మలయాళ హీరో జోజు జార్జ్ మరియు ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా అక్టోబర్ 26న థియేటర్లలో విడుదల అయింది… ఈ మూవీ గురువారం (నవంబర్ 23) నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏకే సజన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ సినిమా అంతా విన్సెంట్ స్కారియా (జోజు) అనే 40 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవడంతో పాటు తనకు కాబోయే భార్య (ఐశ్వర్య రాజేష్) తో కలిసి లేచిపోవడంతో విన్సెంట్ జీవితం మలుపు తిరుగుతుంది.. తన పెళ్లి జరగలేదన్న బాధ విన్సెంట్ ను ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుందో ఈ సినిమాలో చూడొచ్చు. పులిమడ మూవీలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ఈ సినిమాలో కొన్ని సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి.ముఖ్యంగా ఈ సినిమాలో విన్సెంట్ స్కారియాగా జోజు జార్జ్ నటన అద్భుతం అని చెప్పాలి… అతడు విన్సెంట్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అటు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మాహిష్మతిగా నటించింది. పులిమడ సినిమాలోని ఈ లీడ్ క్యారెక్టర్లు సినిమా అంతా ఎంతో ఆసక్తి రేపేలా ఉంటాయి.ఇక సినిమాటోగ్రఫీ,ఆర్ట్ డైరెక్షన్ కూడా ఎంతగానో మెప్పిస్తుంది.ఈ పులిమడ మూవీకి వేణు సినిమాటోగ్రాఫర్ గా వున్నారు.అలాగే జీతూ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ మూవీ లో స్క్రిప్ట్ పరంగా కొన్ని లోపాలు వున్నా కానీ ఈ మూవీ టెక్నికల్ యూనిట్ పనితీరు ఈ సినిమాను కచ్చితంగా చూసే విధంగా చేసింది..ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ సూపర్ అని చెప్పొచ్చు.
