Kannada Hero Pruthvi Ambaar: ప్రముఖ కన్నడ హీరో పృథ్వీ అంబర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పృథ్వీ అంబర్ తల్లి సుజాత శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను చికిత్స నిమిత్తం బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె పరిస్థితి విషమించి నేటి ఉదయం కన్నుమూశారు. దీంతో పృథ్వీ అంబర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హీరో తల్లికి నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో చిన్న హీరోగా పృథ్వీ అంబర్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు. గతేడాది రిలీజ్ అయినా దియా సినిమాతో ఈ యంగ్ హీరో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే పేరుతో ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విరాజయాన్ని అందుకొంది. ఈ సినిమాలో దియా మొదటి బాయ్ ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు పృథ్వీ అంబర్. ఇక ఈ సినిమా తరువాత మంచి అవకాశాలను అందుకుంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం పలు కన్నడ సినిమాలో నటిస్తున్నాడు.
