NTV Telugu Site icon

బిగ్ బాస్ స్టేజిపై బ్రాండ్ అంబాసిడర్ గా అడుగుపెట్టిన నాగ చైతన్య

naga chaitanya

naga chaitanya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్స్ అంగరంగవైభవముగా జరుగుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఫైనల్ విన్నర్ ని నాగ్ ప్రకటించనున్నారు. ఇక ఈ ఫైనల్ కి టాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలువచ్చి సందడిచేశారు. ఇక తాజాగా బిబి స్టేజిపై చైనా బంగార్రాజు అడుగుపెట్టాడు. అక్కినేని వారసుడు నాగచైతన్య తండ్రి నాగ్ తో కలిసి సందడి చేశాడు. నాగ్ స్పెషల్ ఏవిని చూపించిన చైతూ .. హీరోగా కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.

త్వరలో ప్రసారం కానున్న ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్ గా నాగ చైత్యన ఎంపిక అయ్యాడు. ఈ విషయాన్నీ స్టార్ మా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గతంలో ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్ గా రానా వ్యవహరించగా .. ఈ ఏడాది చైతూ ఆ బాధ్యతలు స్వీకరించాడు. లే పంగా అంటూ ఉత్కంఠగా సాగే ప్రో కబడ్డీ పోటీలు త్వరలోనే మొదలుకానున్నాయి. మరి చైతూ బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.