యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అద్భుతమైన అవకాశాన్ని కొత్త ఆర్టిస్టులకు ఇచ్చింది టీం. ఈ మేరకు “ప్రాజెక్ట్ కే” క్యాస్టింగ్ కాల్ కు సంబంధించి ఏప్రిల్ 1న ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో అన్ని ఏజ్ గ్రూపుల వారు, అలాగే అన్ని వర్గాల వారు హైదరాబాద్ లో జరగనున్న ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని వెల్లడించారు.
Read Also : Rahul Sipligunj : పబ్ లో అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ విన్నర్… పోలీసుల అదుపులో 150 మంది
ఇక తాజాగా ఆ ఆడిషన్స్ జరిగే ప్రాంతం, డేట్, టైం వంటి డీటెయిల్స్ ను ప్రకటించారు. ఫీనిక్స్ అరేనా, TSIIC పార్క్, HITEC సిటీ, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఆడిషన్స్ జరగనున్నాయి. ఏప్రిల్ 3వ తేదీన 7 AM – 5 PM వరకు, ఏప్రిల్ 4న 9 AM – 9 PM వరకు ఈ ఆడిషన్స్ కొనసాగనున్నాయి. కొత్త #facesofthefuture కోసం అన్వేషణ కొనసాగుతోంది అంటూ మేకర్స్ తాజాగా డీటెయిల్స్ ను వెల్లడించారు. ఇక ఈ ఆడిషన్స్ లో ఒక్కొక్కరూ 30 సెకన్ల పాటు పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. “ప్రాజెక్ట్ కే” ఆడిషన్స్ లో నటీనటులు, మోడల్స్, డ్యాన్సర్లు, మ్యూజిషియన్లు తదితరులు పాల్గొనవచ్చు. మరి ప్రభాస్ పాన్ ఇండియా, ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
Check out the venue and timings.
📍Phoenix Arena, TSIIC Park, HITEC City, Hyderabad.
April 3rd: 7 AM – 5 PM.
April 4th: 9 AM – 9 PM.The search for the new #facesofthefuture continues. #ProjectK #Prabhas @SrBachchan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms https://t.co/knAlD4xCIS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 3, 2022
