Site icon NTV Telugu

TG Vishwa Prasad: పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నిర్మాత విశ్వప్రసాద్

Tg Vishwaprasad With Pawan Kalyan

Tg Vishwaprasad With Pawan Kalyan

Producer TG Vishwa Prasad Congratulated Pawan Kalyan: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ టెక్ గ్రూప్ అధినేత TG విశ్వ ప్రసాద్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యువ హీరోలు, అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని దాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి, నిర్మాత TG విశ్వప్రసాద్ కి ముందు నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Renuka Swami: రేణుకా స్వామి హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇక దర్శన్ అండ్ కో బయట పడ్డం అసంభవం!

పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ భారీగా గెలవడంతో సినీ పరిశ్రమలో పండుగ వాతావరణం ఉంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ ని కలిసి సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలు చర్చించారు. అనంతరం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి ఇలాంటి ఘన విజయం సాధించినందుకు అభినందించారు. పవన్ కళ్యాణ్ తో నిర్మాత విశ్వప్రసాద్ గారు గతంలో ‘బ్రో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన పార్టీకి కూడా విశ్వప్రసాద్ అండగా ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంటుంది.

Exit mobile version