NTV Telugu Site icon

Tammareddy Bharadwaj: విజయ్ దేవరకొండ కోసం అన్ని కోట్లు ఎవడు పెట్టమన్నాడు..?

Puri

Puri

Tammareddy Bharadwaj: ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం పూరి జగన్నాథ్- డిస్ట్రిబ్యూటర్ల వివాదం. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం విదితమే. నిర్మాతగా పూరితో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ భారీ నష్టాలు చవిచూశారు. మరి ముఖ్యంగా బయ్యర్లు తమ డబ్బును మొత్తం కోల్పోయామని చెప్పడంతో పూరి మంచి మనసుతో వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. నష్టాల్లో ఉన్నవారికి కొంత డబ్బును సర్దుతానని మాట ఇచ్చాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఇంకో బయ్యర్ శోభన్ కలిసి పూరి పరువు తీయాలని నిర్ణయించుకున్నారు. పూరి ఇంటి ముందు ధర్నా చేయడానికి రెడీ అవ్వడంతో.. పూరి తన కుటుంబానికి హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.

ఇక తాజాగా ఈ వివాదంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పూరికి మద్దతు పలికారు. “ఇది సరైన పద్దతి కాదు. బయ్యర్లు మార్కెట్ ను బట్టి డబ్బు పెట్టాలి. విజయ్ దేవరకొండ కోసం అన్ని కోట్లు ఎవడు పెట్టమన్నాడు..?. అతని ముందు సినిమాలు రిజల్ట్స్, మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని డబ్బు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి పూరిని అనడం పద్దతి కాదు. లాభాలు మాత్రమే ఉహించుకొని డబ్బు పెడితే ఆ తరువాత చేసేది కూడా ఏమి ఉండదు. సినిమాలను కొనమని పూరి వారి ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేశారా..? నేనింతే సినిమాకు కూడా ఇలాగే చేశారు. సినిమా పోతే ఆ నష్టాలను పూరి ఎందుకు భరించాలి. విజయ్ దేవరకొండ మీద ఉన్న నమ్మకం తో మీరు డబ్బు పెట్టి ఇప్పుడు పూరిని బ్లేమ్ చేయడం భావ్యమా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.