Sitaramam: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక ఒక కీలక పాత్రలో నటించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతమైన ప్రేమ కావ్యంగా చరిత్రకెక్కింది. ప్రేమకు డబ్బు అవసరం లేదని, కులమతాలు పట్టింపు లేదని నిరూపించింది. ప్రేమించిన మనిషి, ఉన్నా లేకున్నా.. అతని జ్ఞాపకాలలో ఒక మనిషి బతికేయొచ్చు అని ఈ సినిమా చూపించింది. రామ్ గా దుల్కర్.. సీతగా మృణాల్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి. ఇంతటి అద్భుతమైన ప్రేమ కథకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం ప్రతి సినిమాకు సీక్వెల్స్ వస్తూ ఉండడంతో.. ఈ సినిమాకు కూడా సీక్వెల్ వస్తుందేమో అని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు.
Srikanth- Raasi: ఎంత చూడముచ్చటగా ఉన్నారో.. వైరల్ గా మారిన వీడియో
ఇక తాజాగా ఈ సీక్వెల్ పై నిర్మాత స్వప్న స్పందించింది. ఈ బ్యానర్ లోనే ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ వస్తుంది. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న స్వప్న.. సీతారామం సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. “కొన్ని సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిల్లో సీతారామం ఒకటి. సీక్వెల్ గురించి నా మనసులో ఏం లేదు. దర్శకుడు హను రాఘవపూడి ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలను బట్టి ఈ సినిమాకు సీక్వెల్ ఉండదు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
