తనపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసే వారికి నిర్మాత ఎస్.కె.ఎన్ (SKN) గట్టి హెచ్చరికలు జారీ చేశారు, తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఆయన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిర్మాత ఎస్.కె.ఎన్ పేరును వాడుకుంటూ కొన్ని హ్యాండిల్స్ అసభ్యకరమైన, తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నాయి, ముఖ్యంగా సినిమాలను, నటీనటులను టార్గెట్ చేస్తూ నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్న ఈ వ్యవహారంపై ఆయన సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న సదరు వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Also Read :Prabhas: ప్రభాస్‌ను ‘టార్చర్’ పెడుతున్న సందీప్ వంగా ?
ఎస్.కె.ఎన్ ఒరిజినల్ అకౌంట్ లాగే కనిపించేలా నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారు, సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులను ఉద్దేశించి కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. విడుదలైన లేదా విడుదల కాబోతున్న సినిమాలపై కావాలనే విష ప్రచారం చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మేరకు ఆయన పీఆర్ టీం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. “ఇలాంటి దుశ్చర్యలు కేవలం గందరగోళాన్ని సృష్టించడానికి, ప్రతికూలతను పెంచడానికి మాత్రమే చేస్తున్నారని” స్పష్టం చేశారు, ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉంది. బాధ్యులైన వారిని గుర్తించి, కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్.కె.ఎన్ బృందం తెలిపింది. “సోషల్ మీడియాను ఆరోగ్యకరమైన చర్చలకు వాడుకోవాలి కానీ, ఇలా ఎదుటివారిని వ్యక్తిగతంగా దూషించడానికి లేదా తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి వాడుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.”
