Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆయన చేస్తున్న సినిమాలు ఈ నడుమ వరుస హిట్లు కొడుతున్నాయి. తాజాగా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో రాబోతున్నారు. ఇందులో ఆయన ఓ పాత్ర కూడా చేస్తున్నారు. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ లో విలేకర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Read Also : Realme P3 5G: 50MP కెమెరా, 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చేసిన రియల్‌మీ కొత్త ఫోన్
ఈ మూవీ చూసి థియేటర్లలో ఎవరైనా కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరితే ఎలా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. అలా అయితే వారి బిల్లులు మొత్తం నేనే కడుతా అంటూ నాగవంశీ క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. ఈ సినిమా కామెడీతో పాటు మాస్ యాక్షన్ సీన్లతో నిండిందన్నారు. కామెడీనే దీనికి ప్రధాన అంశం అని.. బీటెక్ పాసైన అబ్బాయిలు గోవా వెళ్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించామన్నారు. గత మ్యాడ్ సినిమా కంటే ఇందులో కామెడీ మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. బోణీకపూర్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని.. ఆయన్ను ఎప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. మ్యాడ్ సినిమాను ఆదరించాలని.. అందరూ చూసే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.