Gentleman 2కు హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. యాక్షన్ కింగ్ అర్జున్, మధుబాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన “జెంటిల్మెన్” మూవీ అప్పట్లో ఓ సంచలనం అన్న విషయం తెలిసిందే. 1993లో విడుదలైన ఈ మూవీని నిర్మాత కుంజుమోన్ నిర్మించగా, శంకర్ దర్శకత్వం వహించారు. సినీ ప్రేమికుల మదిలో ఈ మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు “జెంటిల్మెన్” సీక్వెల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 2020లో ప్రముఖ నిర్మాత కేటీ కుంజుమోన్ బ్లాక్ బస్టర్ వెంచర్ “జెంటిల్మెన్”కి సీక్వెల్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చిత్రంలో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంపికైంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. నిర్మాత కుంజుమోన్ తాజాగా సినిమాలో నటించనున్న హీరోయిన్ పేరును ప్రకటించి పుకార్లకు చెక్ పెట్టారు.
Read Also : Ramarao On Duty : రిలీజ్ డేట్ లాక్… ఎప్పుడంటే ?
నిర్మాత కుంజుమోన్ సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంలో నటించనున్న హీరోయిన్ పేరును ప్రకటించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తి హీరోయిన్ అని అధికారికంగా అనౌన్స్ చేశారు. మాలీవుడ్ లో ఈ అమ్మడిని బేబీ నయనతార అని కూడా పిలుస్తారు. కాగా ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్న దర్శకుడు ఎవరన్న విషయాన్ని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. Gentleman 2కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Happy to Introduce #NayantharaaChakravarthy as the lead actress in #Gentlemen2#ஜென்டில்மேன்2 #ജെന്റിൽമാൻ2#జెంటిల్మాన్2#ಜಂಟಲ್ಮನ್2@mmkeeravaani #GentlemanFilmInternational@ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @Fridaymedia2
— K.T.Kunjumon (@KT_Kunjumon) March 23, 2022
Another lead actress will be revealed soon pic.twitter.com/2MMkuCHF6N
