Bunny Vasu: ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే నేడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు. బన్నీవాసు నిర్మాతగానే కాకుండా జనసేన సభ్యుడిగా కూడా కొనసాగుతున్న విషయం తెల్సిందే. భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంత ప్రజలు కష్టాలు పడుతున్న వేళ వారికి ఆపన్న హస్తం ఇవ్వడానికి జన సైనికులతో కలిసి ఆదివారం పాలకొల్లులో పర్యటించారు. ఈ క్రమంలోనే బాడవ గ్రామంలో చిక్కుకున్న వరద బాధితులను తరలిస్తున్నారు. అక్కడ ఒక గర్భిణీ స్త్రీ కనిపించాయా .. వెంటనే ఆమెను పడవలోకి ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వెంటనే బన్నీ వాసు గర్భిణీ స్త్రీ ను లోపలి లాగడానికి ప్రయత్నించారు.
పడవ వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ఒక కొబ్బరి చెట్టును ఢీకొని విరిగిపోయింది. ప్రయాణికులందరూ నీళ్లలో పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న పడవ నడిపేవారు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అందులో బన్నీవాసు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బన్నీవాసు మాట్లాడుతూ” అదృష్టం బావుండి అందరం బయటపడ్డాం. ప్రమాదం అంచున ఇంకా గోదావరి గ్రామాలు ఉన్నాయి. వారందరినీ ప్రభుత్వం రక్షించాలి” అని కోరారు. ఇక బన్నీవాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ స్నేహితుడిగా, అల్లు అరవింద్ బిజినెస్ పాట్నర్ గా కొనసాగుతున్నాడు. ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమాను నిర్మించిన బన్నీవాసు ప్రస్తుతం మరో రెండు సినిమాలను నిర్మిస్తున్నాడు.
