Site icon NTV Telugu

Bandla Ganesh: ఇక గుడ్ బై.. నాకు ఎవరితో ఏ సంబంధం లేదు..

Bandla

Bandla

Bandla Ganesh: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ నిర్మాతగా హిట్ అందుకొని రాజకీయ నాయకుడిగా ఎదగాలి అన్న పట్టుదలతో బండ్లన్న రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అన్నట్లు రాజకీయాలల్లో బొక్కా బోర్లా పడ్డాడు. ఇక ఏదైతే అది అయ్యింది అనుకోని మళ్లీ తెరపై కనిపించడమా మొదలుపెట్టాడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో బండ్ల స్పీచ్ లు, ఇంటర్వ్యూలు, ట్వీట్లు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు పరమ భక్తుడైన బండ్ల.. ఆయన గురించి మాట్లాడితే పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయమే. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బండ్ల గణేష్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

“రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అందరూ ఆత్మీయులే..” అంటూ రాసుకొచ్చాడు. అయితే బండ్ల నిర్ణయాన్ని స్వాగతించని కొంతమంది అభిమానులు పవన్ లా పోరాడాలని తెలుపగా.. నాకంత స్థాయి లేదు అంత గొప్ప వాన్ని కాదు సోదర అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి. పోనిలే ఇన్నాళ్లకు ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడని కొంతమంది అంటుండగా.. అయ్యో బండ్లన్న నువ్వు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏంటి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version