Site icon NTV Telugu

The OG: ఇవి ఎక్కడి అనౌన్స్మెంట్ లు మావా బ్రో… హైప్ పెంచుతూనే ఉన్నావ్

The Og

The Og

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కంపించేలా చేస్తున్న ఒకే ఒక్క పేరు ‘THE OG’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ సుజిత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకూ OG సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ అసలు డ్రాప్ అవ్వలేదు. జనాలని OG సినిమా మర్చిపోనివ్వకుండా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చెయ్యనంత సౌండ్ ని ‘OG’ చేస్తోంది. సుజిత్, పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అవ్వడంతో ‘OG’ సినిమా గబ్బర్ సింగ్ ని మించే రేంజులో ఉంటుందని ఫాన్స్ నమ్ముతున్నారు. గన్స్, మాఫియా, లవ్ ఎమోషన్స్ ని మిక్స్ చేసిన కథతో తెరకెక్కుతున్న OG సినిమా ప్రతి ఒక్కరికీ పంజా వైబ్స్ ని ఇస్తోంది. ఇటివలే షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేసిన మేకర్స్, పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయితే మరో అప్డేట్ ఇచ్చారు.

ముంబైలో షూటింగ్ స్పాట్ లో నుంచి రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలే 24 గంటలుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి అనుకుంటే అది జస్ట్ శాంపిల్ మాత్రమే ముందుంది అసలు ఫెస్టివల్ అంటూ మేకర్స్ మరో సాలిడ్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించినా ఆయన పక్కన ఒక క్వీన్ ఉండాలి కదా, అదే హీరోయిన్ కావాలి కదా… ఆ పాత్రకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తూ OGలో ప్రియాంక మోహన్ నటిస్తుందని మేకర్స్ చెప్పేసారు. OGలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుందనే విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటే కానీ అఫీషియల్ గా బయటకి రావడంతో ఫాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ముంబైలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ ల మధ్య సీన్స్ కి షూట్ చేస్తున్నారు. మరి అనౌన్స్మెంట్ ల తోనే అంచనాలు పెంచుతున్న OG చిత్ర యూనిట్ నుంచి నెక్స్ట్ ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.

Exit mobile version