NTV Telugu Site icon

Priyanka Jawalkar: అనంతపురం పిల్ల ఎంత చూపించినా.. సెట్ అవ్వడం లేదే

Priyanka Jawalkar

Priyanka Jawalkar

హీరోయిన్ అవ్వాలి అంటే గ్లామర్ ఉండాలి, ఆ గ్లామర్ ని ప్రదర్శించడం కూడా తెలియాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు హీరోయిన్ గా కొనసాగుతారు, స్టార్ స్టేటస్ కూడా అందుకుంటారు. యాక్టింగ్ టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉండాలి, ఇంఫాక్ట్ యాక్టింగ్ కన్నా గ్లామర్ కే ఎక్కువ మార్క్స్ వెయ్యడం మన ఫిల్మ్ మేకర్స్ ని అలవాటైన పని. అందుకే మనకి టాలెంట్ కన్నా అందం చాలా ఫేమస్. ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోయిన్స్ లో యాక్టింగ్ స్కిల్స్, ఏడుపు సీన్స్ చూస్తే తెలుస్తుంది మన స్టార్ హీరోయిన్స్ లో ఎంత టాలెంట్ ఉందో. ఇలాంటి వాళ్లందరినీ స్టార్ హీరోయిన్ గా నిలబెట్టేది వారి అందమే. ఈ అందమే మా దగ్గర కూడా ఉంది, మేము కూడా గ్లామర్ గానే ఉంటాము, మాకు రెస్ట్రిక్షన్స్ లేవు అంటూ తెలుగు అమ్మాయిలు కూడా ఈ మధ్య హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ ని పోస్ట్ చెయ్యడంలో ముందున్న తెలుగు హీరోయిన్స్ లో అందరికన్నా ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రియాంక జవాల్కర్ గురించి.

ఈ అనంతపూర్ అమ్మాయి నడుముకి యూత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ట్యాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందంతో పాటు కాస్త యాక్టింగ్ టాలెంట్ కూడా ఉన్న ఈ తెలుగు అమ్మాయి, స్కిన్ షోకి నేను అడ్డం చెప్పను అనే ప్రయత్నం చేస్తూ కొత్త కొత్త ఫోటోస్ ని పోస్ట్ చేస్తుంది. తాజాగా అలా పోస్ట్ చేసిన గ్రీన్ కలర్ స్లిట్ కట్ ఫోటోస్ లో ప్రియాంక జవాల్కర్ బాంబ్ షెల్ లా ఉంది. తన గ్లామర్ టాలెంట్ ని చూపిస్తూ అభిమానులని ఖుషి చేస్తున్న ప్రియాంక జవాల్కర్, తన హద్దుల్ని పూర్తిగా చెరిపేసింది. గ్రీన్ కలర్ ఫోటోస్ చూస్తే ప్రియాంక జవాల్కర్ అసలు తెలుగు అమ్మాయేనా లేక ఏ బాలీవుడ్ నుంచి అయినా దిగిన అమ్మాయా అనిపించకమానాదు. ఇంత చూపిస్తే ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు వస్తాయి కానీ ప్రియాంకకి మాత్రం సినిమాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి.