NTV Telugu Site icon

Priyanka Jain: బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశా.. ఏడుస్తూ సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్

Priyanka Jain Crying

Priyanka Jain Crying

Priyanka Jain Latest Youtube video goes Viral in Social Media: బిగ్బాస్ సీజన్ సెవెన్ తెలుగు లో హాట్ టాపిక్ అయిన కంటెస్టెంట్స్ లో మొదటి వరుసలో వినిపించే పేరు ప్రియాంక జైన్. నిజానికి మార్వాడి కుటుంబానికి చెందిన ఆమె నటన మీద ఆసక్తితో సీరియల్స్ లో నటిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా సినీ అవకాశాలు కూడా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఆమె హీరోయిన్గా ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ ఎందుకో సీరియల్స్ తో వచ్చినంత క్రేజ్ మాత్రం అక్కడ రాలేదు. బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి ఎంటర్ అయ్యి బలమైన కంటెస్టెంట్గా నిలబడిన ఆమె అసలు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉంటే బాగుండేది అంటూ బోరున ఏడుస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టిన వీడియో హాట్ టాపిక్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని భావించిందట. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు అంతా జరుగుతోందని ఆమె వెల్లడించింది. ఎందుకంటే తన తల్లికి ఈ మధ్యనే సర్జరీ జరిగిందని క్యాన్సర్ మొదటి దశలో ఉండటం వల్లే ఈ సర్జరీ చేయించినట్లు ఆమె వెల్లడించారు.

Hanuman Team: సీఏం యోగిని కలిసిన హనుమాన్ టీమ్.. ఎందుకో తెలుసా?

ఆడవారికి ప్రతినెలా వచ్చే పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదని వయసు పెరుగుతూ ఉండటం వల్ల వచ్చే మార్పులు అని ముందు అనుకున్నాం కానీ హాస్పిటల్ లో చూపించిన తర్వాత క్యాన్సర్ అని తెలిసిందని ప్రియాంక చెప్పుకొచ్చారు. ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఈ సమస్య మొదలైంది కానీ ప్రియాంకని బిగ్ బాస్ లో చూడాలని ఆమె తల్లి ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదట. ఇదంతా తెలిసిన తర్వాత నేను హౌస్ కి వెళ్లకుండా ఉంటే బాగుండేదని ప్రియాంక ఏడుస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో పెట్టింది. గర్బాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని చెప్పడంతో ఆమెకు ఆ సర్జరీ చేయించారు. ప్రస్తుతానికి ఆ సర్జరీ సక్సెస్ఫుల్గా పూర్తి కావడంతో తమకు ఎలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో లేవు అని చెప్పుకొచ్చారు అయితే తాను బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉంటే తల్లి ఆరోగ్యం గురించి ముందే కేర్ తీసుకుని ఉండేదాన్ని అసలు ఇంతవరకు వచ్చేది కాదని ప్రియాంక చెప్పుకొచ్చారు.