గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి అందరికి తెలుసు..అమెరికాలో ఓ షోకి హాజరయ్యారు. అమెరికన్ సింగర్ బియాన్సే లైవ్ మ్యూజిక్ షో వీక్షించిన ప్రియాంక అక్కడ దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు కామెంట్లను కూడా అందుకుంటున్నాయి..
తాజాగా ప్రియాంక అమెరికాలో సండే సింగర్ బియాన్సే షో అంటే మ్యూజిక్ లవర్స్ చాలా ఇష్టపడతారు. ప్రియాంక చోప్రా సైతం సండే జరిగిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కి హాజరయ్యారు. ఫోటోలు వీడియోలు షేర్ చేశారు. ప్రియాంక చోప్రా షోను బాగా ఎంజాయ్ చేశారు. బియాన్సేను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రియాంక చోప్రా సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో షోలో ప్లే చేసిన న్యూడ్ ఫోటోలను కూడా పంచుకున్నారు. అది కాస్త వైరల్ అవుతుంది..
కాగా, ఇటీవల బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ మీడియా ఇంటరాక్షన్ లో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ… బాలీవుడ్ పరిశ్రమ నన్ను పక్కన పెట్టేసింది. ఉద్దేశపూర్వకంగా అవకాశాలు రాకుండా చేశారు. అందుకే నేను హాలివుడ్ సినిమాలను చేస్తున్నానని చెప్పింది.. ఆ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి.. దాంతో ఇండస్ట్రీలో చాలా మంది ఈ అమ్మడు పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఇక ప్రస్తుతం హాలివుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. వరుసగా ఆ సినిమాలు విడుదల అవుతున్నాయి..