Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ మరో ఆసక్తికరమైన హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో కలిసి ఆమె ‘బ్లూఫ్లై’ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు ‘ప్రెడేటర్స్’, ‘స్ట్రేంజర్ థింగ్స్’తో గుర్తింపు పొందిన నిమ్రోడ్ అంటాల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘బ్లూఫ్లై’ కథ కూడా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది. ఐక్యరాజ్యసమితి సభ్యురాలు అనూహ్యంగా కాంగోలో జరిగే సీక్రెట్ బ్లాక్ ఆప్స్ మిషన్‌లోకి లాగబడుతుంది. ఒక ప్రమాదకరమైన ప్లేన్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే ఆ సీక్రెట్ మిషన్. అయితే ఆప్రమాదకరమైన మిషన్ ముందుకు సాగుతున్న కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. చివరకు ఆ మిషన్ వెనుక భయంకరమైన సీక్రెట్ తో కథ మొత్తం ప్రాణాల కోసం పోరాటంగా సాగుతుంది.
ఈ మూవీకి డేవిడ్ ఫ్రిగేరియో, విలియం యూబ్యాంక్, కార్లైల్ యూబ్యాంక్ కలిసి స్క్రీన్‌ప్లే అందించారు. మైఖేల్ జెఫర్సన్, డేవిడ్ ఫ్రిగేరియో, డెబోరా గ్లోవర్, అరియాన్ ఫ్రేజర్, డెల్ఫిన్ పెరియర్, వెనెస్సా యావో గువో నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అమ్మకాల బాధ్యతలను హైలాండ్ ఫిల్మ్ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ అంచనాలతో పరిచయం చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దర్శకుడు నిమ్రోడ్ అంటాల్ ‘బ్లూఫ్లై’ మూవీ కథ నరాలు తెగే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రియాంక చోప్రాకు కూడా ‘బ్లూఫ్లై’ మరో కీలకమైన ప్రాజెక్ట్‌గా మారనుంది. హాలీవుడ్‌లో తన కెరీర్‌ను విస్తరించుకుంటున్న ఆమె ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు రస్సెల్ క్రో ఇటీవల ‘నూరెంబర్గ్’లో కనిపించగా, ‘హైలాండర్’ సహా మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ప్రముఖ నటులు కలిసి నటిస్తుండటంతో ‘బ్లూఫ్లై’పై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది.

