Site icon NTV Telugu

Priyanka Dutt : బుజ్జి ఈవెంట్లో హాట్ టాపిక్ గా మారిన ప్రియాంక వ్యవహార శైలి

Bujji And Bhairava Animation Series

Bujji And Bhairava Animation Series

Priyana Dutt Hot topic at Bujji And Bhairava Animation Series Trailer Launch: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయింది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంతకుముందే బుజ్జి వర్సెస్ భైరవ అనే పేరుతో ఒక పెద్ద లాంచ్ ఈవెంట్ చేసి అందరి దృష్టి ఈ సినిమా మీద పడేలా చేసింది సినిమా యూనిట్. దానికి తోడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా బుజ్జితో భైరవ అంటూ ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా చేసింది.

Weapon Trailer Launch: ‘అది ఆట కాదు.. యుద్ధం..’ సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ‘వెపన్’..

దానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈరోజు స్ట్రీమింగ్ చేశారు. హైదరాబాద్ ఏఎంబీ థియేటర్లో మీడియాతో పాటు కొంతమంది కామన్ ఆడియన్స్ కి కూడా ప్రవేశం కల్పించారు. అయితే చిన్నపిల్లలను టార్గెట్ చేసి చేసిన ఈ యానిమేటెడ్ సిరీస్ ని వీక్షించిన అనంతరం అక్కడ పిల్లలకు స్నాక్స్ కూడా టీం ప్రొవైడ్ చేసింది. ఆ తర్వాత ఈ సినిమాకి నిర్మాతలలో ఒకరిగా వ్యవహరిస్తున్న నాగశ్విన్ భార్య ప్రియాంక దత్ తమ దగ్గర ఉన్న బుజ్జి -భైరవ స్టిక్కర్స్ ని అక్కడ పిల్లలందరికీ స్వయంగా పంచిపెట్టడం హాట్ టాపిక్ అయింది. నిజానికి ఇలాంటి ఈవెంట్స్ లో నిర్మాతలు హుందాగా ఒక పక్కన కూర్చుంటారు. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన వారే ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఈవెంట్ విషయంలో ప్రియాంక చొరవ తీసుకుని అలా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి వాటిని పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది.

Exit mobile version