NTV Telugu Site icon

Sarvam Shakthi Mayam: ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

Sarvam Shaktimayam

Sarvam Shaktimayam

Priyamani’s ‘Sarvam Shaktimayam’ will be streaming on aha from October 20: ప్రియమణి, సంజయ్ సూరి మెయిన్ లీడ్‌గా ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ రూపొందింది. బివిఎస్ రవి కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరించగా ప్రదీప్ మద్దాలి తెరకెక్కించాడు. హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన ఈ సిరీస్ ని అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌ను నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఆహాలో ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు యూనిట్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది, ఈ వెబ్ సిరీస్ అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాల గురించి ఉంటుందని తెలుస్తోంది. ఒక వ్యక్తి తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి అన్ని శక్తి పీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం తిరుగుతుందని అంటున్నారు.

Ambajipeta Marriage Band: ఎక్కడ దొరుకుతాయి సుహాస్ అన్నా.. నీకు ఇలాంటి కథలు

మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడైయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కూడా ఈ కథ సాగుతుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తంగా పది ఎసిసోడ్‌లు ఉంటాయని, ఇక ఈ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుందని మేకర్స్ చెబుతున్నాయి. మరో వైపు ఓటీటీలో ఇలా అష్టాదశక్తి పీఠాల మహత్యం చెప్పేలా వెబ్ సిరీస్ రానుండడం చర్చకు దారి తీస్తోంది. ఈ సిరీస్ ద్వారా మొత్తం భారతదేశం లో ని 17 శక్తిపీఠాలతో పాటు శ్రీలంకలోని శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవచ్చుని ఈ దసరాకు ‘సర్వం శక్తి మయం’ అనే ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలోనూ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రియమణి, సంజయ్ సూరిలతో పాటుగా సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లపు వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Show comments