Site icon NTV Telugu

Priyadarshi : అదే నా డ్రీమ్‌ రోల్‌

Priyadarshi

Priyadarshi

నటుడు ప్రియదర్శి గురించి పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి కాస్తంత డిఫరెంట్‌గా వెళ్తున్న ఆయన కమిడియన్‌ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అక్కడితో ఆగకుండా హీరోగా వైవిధ్యమైన కాన్సెప్టు లతో ‘బ‌ల‌గం’, ‘మ‌ల్లేశం’ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలు చేసి తనలోని కొత్త కోణాన్ని బయట పెట్టాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు నాని నిర్మాత‌గా తీసిన ‘కోర్ట్’ మూవీ లోనూ హీరోగా చేస్తున్నారు. రామ్‌జగదీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇక షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమెషన్ కూడా జోరుగా చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా తాజాజా ప్రియదర్శి మీడియాతో ముచ్చడించాడు..

Also Read : Ilaiyaraaja : అసలైన ఆట ఇప్పుడే మొదలైంది..

ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.  మూడేళ్ల క్రితం దర్శకుడు రామ్‌ జగదీష్‌ ఈ స్టోరీ చెప్పాడు. బాగుందనిపించింది ఇలాంటి కథల్ని తప్పకుండా ప్రేక్షకులకు చూప్పించాలి అనుకున్న. గోవాలో ‘హాయ్‌ నాన్న’ షూటింగ్‌ టైమ్‌లో నానికి ఈ కథ గురించి చెప్పా. ఆయనకు బాగా నచ్చి ‘ఈ సినిమా మనం చేస్తున్నాం’ అన్నారు. అలా ‘కోర్ట్’ పట్టాలెక్కింది. ఈ క్యారెక్టర్‌ కోసం కోర్టుల్లో లాయర్లు, జడ్జీలు వాడే భాష, వారి వస్త్రధారణ.. ఇలా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించాను. సెక్షన్లను కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నా. ఈ క్యారెక్టర్‌ చేశాక లాయర్ల మీద గౌరవం పెరిగింది. అంబేద్కర్‌గారు రాసిన రాజ్యాంగం మనకు ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమైంది. నాకు శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాద్‌గారి బయోపిక్‌లో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అది నా డ్రీమ్‌ రోల్‌’ అంటూ చెప్పుకొచ్చాడు.

Exit mobile version